దేవర ఫస్ట్ గ్లింప్స్ రెడీ

దేవర ఫస్ట్ గ్లింప్స్ రెడీ

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అప్‌‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌‌కు  న్యూఇయర్ రోజున గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. 

జనవరి 8న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ.. ఎన్టీఆర్ కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.  అలలతో ఎగిసిపడే సముద్రంలో బోట్‌‌పైన ఠీవిగా నిలుచున్న తారక్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. జాన్వీకపూర్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ  చిత్రంలో  సైఫ్‌‌ అలీఖాన్‌‌ విలన్‌‌గా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సముద్రం బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.  ఏప్రిల్‌‌ 5న ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా వైడ్‌‌గా విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌‌లో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.