Vishwambhara: ఎత్తైన వ్యక్తులు.. బారెడు చెవులు.. విశ్వంభర కోసం వినూత్న లోకం

Vishwambhara: ఎత్తైన వ్యక్తులు.. బారెడు చెవులు.. విశ్వంభర కోసం వినూత్న లోకం

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). బింబిసారా ఫేమ్ దర్శకుడు వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పీరియాడికల్ అండ్ సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారట మేకర్స్. విజువల్ వండర్ గా, ఆడియన్స్ కి సరికొత్త లోకంలోకి వెళ్లిన ఫీలింగ్ వచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారట మేకర్స్. అందుకే ప్రతీ ఎలిమెంట్ వినూత్నంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. 

తాజాగా ఈ సినిమానుండి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం సరికొత్త లోకాన్ని సృష్టిస్తున్నారట. ఆ లోకంలో ఉండే వ్యక్తులు చాలా పొడవుగా ఉండి, వారి చెవులు కూడా బారెడు పొడవుగా ఉంటాయట. ప్రస్తుతం ఈ లోకానికి సంబందించిన షూట్ జరుగుతోందట. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో సరికొత్త లోకాన్ని సెట్ గా వేశారట. ఈ నేపధ్యంలో వచ్చి సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలువడమే కాదు.. ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాయట. ఈ న్యూస్ తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. 

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చెన్నై చిన్నది త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. కథ రీత్యా ఈ సినిమాలో చిరుకి ఐదుగురు చెల్లెల్లు ఉంటారట.. అందులో ముగ్గురు సురభి, ఆషిక రంగనాథ్. ఇషా చావ్లా కాగా మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోట కే నాయుడు కెమెరామెన్ గా చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.