Kalki OTT Rights: కల్కి OTT రైట్స్ కోసం మేకర్స్ భారీ డిమాండ్.. వామ్మో.. మరీ అంత అమౌంటా!

Kalki OTT Rights: కల్కి OTT రైట్స్ కోసం మేకర్స్ భారీ డిమాండ్.. వామ్మో.. మరీ అంత అమౌంటా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) సినిమాకు డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. దానికి కారణం.. ఈ సినిమా తెరకెక్కుతున్న స్కేల్. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రేంజ్ లో రానుంది కల్కి సినిమా. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థమవుతోంది. అవే కాకుండా మేకర్స్ ఇస్తున్న చిన్న చిన్న అప్డేట్స్ తో ఆ హైప్ నెక్స్ట్ లెవల్  కు చేరుకుంటున్నాయి. తాజాగా కల్కి సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అదేంటంటే.. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా ఓటీటీ రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేస్తన్నారట మేకర్స్. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ అప్రోచ్ అవగా దిమ్మతిరిగిపోయే అమౌంట్ చెప్తున్నారట. ఓటీటీ సంస్థలి ఈ సినిమా కోసం రూ.150 నుండి రూ.175 కోట్లవరకు పెట్టడానికి సిద్దమవగా.. రూ.200 కోట్లు చెల్లించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారట. ఆ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారని టాక్. మరి ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. 

ఇక కల్కి 2898 సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. భారతీయ ఇతిహాసమైన మహాభారతం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మహాభారత కాలం నుండి 2898వ సంవత్సరం వరకు దాదాలు ఆరువేల ఏళ్ల మధ్య జరిగే కథ కల్కి. ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ, ఆ సమయంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాయిదా పడే అవకాశం ఉందని టాక్.