ఊరు పేరు భైరవకోన మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఊరు పేరు భైరవకోన మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫాంటసీ చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్.  అనిల్ సుంకర సమర్పణలో రాజేష్​ దండా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌‌‌‌తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  గురువారం సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్‌‌గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని యాక్షన్ లుక్‌‌లో కనిపిస్తూ  సినిమాపై  ఆసక్తిని పెంచుతున్నాడు.  షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం  హైదరాబాద్‌‌లో షూట్ జరుగుతోంది.  ‘టైగర్’ తర్వాత సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ కావడం, అలాగే ఇది సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌‌తో వస్తుండటంతో  సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.