యానిమల్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

యానిమల్  ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

రణబీర్ కపూర్ - రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న సినిమా విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌‌‌‌లో వేగం పెంచిన మేకర్స్.. గురువారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. చిన్నప్పటి తనలా యాక్ట్ చేయమని తండ్రి పాత్ర పోషిస్తున్న అనిల్‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌ను, రణబీర్ కపూర్ అడిగే ఓ ఇంటెన్స్ సీన్‌‌‌‌తో ట్రైలర్ మొదలైంది. చిన్నప్పటి నుంచి తండ్రిని ఎంతో ప్రేమించే కొడుకుకు ఆ తండ్రి ప్రేమ, ఆదరణ దక్కకపోవడంతో ఎలా మారాడు. 

పెద్దయ్యాక తన తండ్రిని చంపడానికి ప్రయత్నించిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌గా కనిపిస్తోంది. యువకుడిగా, భర్తగా, ప్రతీకారం తీర్చుకునే కొడుకుగా రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అలాగే తండ్రి పాత్రలో అనిల్ కపూర్, భార్యగా రష్మిక, విలన్‌‌‌‌గా బాబీ డియోల్ ఇంప్రెస్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే మోస్ట్ వయొలెంట్ యాక్షన్ సినిమా ఇదని అర్థమవుతోంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు.