కొత్త అప్‌‌డేట్‌‌.. దేవర టీజర్ వస్తోంది

కొత్త అప్‌‌డేట్‌‌.. దేవర టీజర్ వస్తోంది

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ విలన్‌‌గా నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త అప్‌‌డేట్‌‌ తెరపైకొచ్చింది.

ఫస్ట్ పార్ట్‌‌ షూటింగ్‌‌ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో టీజర్‌‌‌‌ రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. డిసెంబర్‌‌‌‌ 20 లోపు ఈ టీజర్‌‌‌‌ను రిలీజ్‌‌ చేయనున్నారట. అంతేకాదు 21, 22 తేదీల్లో విడుదలవుతున్న షారుఖ్ ‘డంకీ’, ప్రభాస్ ‘సలార్’ సినిమాలకి ‘దేవర’ టీజర్‌‌‌‌ను అటాచ్‌‌ చేసి పాన్ ఇండియా వైడ్‌‌గా థియేటర్స్‌‌లో ప్రదర్శించబోతున్నట్టు టాక్. త్వరలో టీజర్‌‌‌‌ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్‌‌ చేయనున్నారు.

నిజానికి ఏప్రిల్‌‌ 5న సినిమా విడుదలవుతున్న క్రమంలో సంక్రాంతికి టీజర్‌‌‌‌ రిలీజ్‌‌ చేస్తారని అంతా భావించారు. అయితే డిసెంబర్‌‌‌‌ నుంచి ప్రమోషన్‌‌ స్టార్ట్ చేస్తే నార్త్‌‌లో ఇంకాస్త ఎక్కువ రీచ్‌‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.