వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను చూపిస్తూ నాలుగేళ్ల క్రితం ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి.వి.రాఘవ ఇప్పుడు దానికి సెకెండ్ పార్ట్‌ను రూపొందిస్తున్నాడు. శివ మేక నిర్మిస్తున్నారు. ‘యాత్ర 2’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు.
గురువారం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక చైర్‌లో మమ్ముట్టి కూర్చోగా, మరో చైర్‌లో జీవా కనిపిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి, జగన్ డ్రెస్సింగ్ స్టైల్, హావభావాలతో ఈ ఇద్దరూ కనిపిస్తున్న తీరు సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 8న సినిమా విడుదల కానుంది.
