మకుటం మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. త్రీ డిఫరెంట్ గెటప్స్‎లో విశాల్

మకుటం మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. త్రీ డిఫరెంట్ గెటప్స్‎లో విశాల్

విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘మకుటం’. గణేష్ చతుర్ధి సందర్భంగా ఈ చిత్రం నుంచి విశాల్ స్పెషల్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌‌లో తను  కనిపించబోతోన్నాడని రివీల్ చేశారు.  యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌‌లో ఉన్న విశాల్ పోస్టర్  అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఈ చిత్రంలో  అంజలి, దుషార విజయన్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు.