V6 News

కాకా కుటుంబంపై వ్యాఖ్యలు.. మోత్కుపల్లి అజ్ఞానానికి నిదర్శనం: చెన్నయ్య

కాకా కుటుంబంపై వ్యాఖ్యలు.. మోత్కుపల్లి అజ్ఞానానికి నిదర్శనం: చెన్నయ్య

సైఫాబాద్, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య తీవ్రంగా ఖండించారు. సోమవారం లక్డికాపూల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకా (వెంకటస్వామి) కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం, పేదల అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, అటువంటి కుటుంబంపై పదవుల గురించి మాట్లాడటం మోత్కుపల్లి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.

తన స్వలాభం కోసం ఎన్నో పార్టీలు మారిన మోత్కుపల్లికి.. ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కలేదన్న ఆక్రోశంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు ఇప్పటికే అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా మోత్కుపల్లి తన వైఖరి మార్చుకోకపోతే మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.