హలో మాల చలో ఢిల్లీ సక్సెస్ చేయండి

హలో మాల  చలో ఢిల్లీ  సక్సెస్ చేయండి

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించే ‘హలో మాల -చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను శనివారం బంజారాహిల్స్లోని మాల మహానాడు ఆఫీసులో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ..ఈ నెల 18 నుంచి 22 వరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్  వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలలోని మాల మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కళాకారులు, న్యాయవాదులు, విద్యార్థులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేయాలని కోరారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల ఎంపీలను, బీఎస్పీ చీఫ్ మాయావతిని కలిసి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు చెన్నయ్య పేర్కొన్నారు.