
మంత్రి శ్రీధర్ బాబును బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య. దళితుడైనందుకే సరస్వతీ పుష్కరాలకు స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణను పిలవకుండా అవమానించారని ..దీని వెనుక శ్రీధర్ బాబు హస్తం ఉందని ఆరోపించారు. శ్రీధర్ బాబుకు దళితులంటే చిన్నచూపని ఆయన వద్దకు వచ్చే ప్రజలతో కూడా సాష్టాంగ నమస్కారము పెట్టించుకునే మనస్తత్వం అని విమర్శించారు.
దేవాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలజా మేడం,మంత్రి శ్రీధర్ బాబు కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఓ వైపు రాహూల్ గాంధీ భారత రాజ్యాంగం ప్రకారం దేశ ప్రజలంతా సమానని చెబుతుంటే.. మంత్రి శ్రీధర్ బాబు దళితులు వేరు తాము వేరు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులను అవమానించిన మంత్రి శ్రీధర్ బాబును వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేస్తామని చెన్నయ్య అన్నారు.
►ALSO READ | వేములవాడకి కొత్తగా సబ్ రిజిస్టర్ ఆఫీస్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మే 15న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా స్థానిక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఫోటోను పెట్టలేదు. దీనిపై దళిత నేతలు ఆందోళన చేశారు. వంశీకృష్ణ దళితుడైనందుకే అవమానిస్తున్నారని పుష్కరాల్లో ఆందోళన చేశారు