మలబార్‌‌ కొత్త షోరూమ్‌ 5న ప్రారంభం

మలబార్‌‌ కొత్త షోరూమ్‌ 5న  ప్రారంభం

హైదరాబాద్‌, వెలుగు: మలబార్  గోల్డ్ అండ్ డైమండ్స్‌ హైదరాబాద్‌లోని  మేడిపల్లి  పీర్జాదిగూడ దగ్గర ఏర్పాటు చేసిన కొత్త షోరూమ్‌ను ఈ నెల 5న ప్రారంభించనుంది.  ఈ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌‌ అమర్‌‌ సింగ్, డిప్యూటీ మేయర్  కుర్ర శివ కుమార్‌‌ పాల్గొననున్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌  తెలంగాణలో విస్తరిస్తోంది. 

 వివిధ జ్యువెలరీ కలెక్షన్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది.  కస్టమర్లకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందిస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం11 దేశాల్లో 320 కి పైగా  స్టోర్లను ఆపరేట్ చేస్తోంది.

ALSO READ | ఫోన్లపై బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీలో దసరా ఆఫర్లు