పంజాగుట్ట, వెలుగు : ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్తగా 10 షోరూలను ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ఉందని మలబార్ గ్రూప్ చైర్మన్ మహమ్మద్ తెలిపారు. గురువారం సోమాజిగూడలోని సంస్థ షోరూంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెలాఖరు నాటికి షోరూంల సంఖ్యను 350కి చేర్చాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆభరణాల సంస్థగా మలబార్ గుర్తింపు పొందడమే కాకుండా..డెలాయిట్ లగ్జరీ గూడ్స్ గ్లోబల్ ర్యాంకింగ్ లో 19వ స్థానంలో ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా మార్కెట్ టు ది వరల్డ్ అనే లక్ష్యంతో అంతర్జాతీయంగా గొప్ప పురోగతి సాధించామన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్, ఈజిప్ట్, టర్కీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో మలబార్ కొత్త షోరూంలు ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయంగా విస్తరణను మరింతగా పెంచుకుంటుందన్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించడం, పని వాతావరణాన్ని కల్పించడం వంటి అంశాల్లో మలబార్ గ్రూప్ ప్రసిద్ధి చెందిందన్నారు.
