
ఖైరతాబాద్ , వెలుగు: మాలలు ఒకతాటిపైకి వచ్చే విధంగా.. వారిని చైతన్య పరిచేందుకు బస్తీ బాట నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర మాలల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాలల సమస్యలు తెలుసు కునేందుకు ఈ నెల 29న ఆదివారం గ్రేటర్ పరిధిలో బస్తీ బాట ప్రారంభిస్తున్నామని, వచ్చే నెల 19న సిటీలో అలయ్..బలయ్కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.