మే11న తిరుపతిలో మాలల ఆత్మీయ సభ.. ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మే11న తిరుపతిలో మాలల ఆత్మీయ సభ.. ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మాలల ఆత్మీయ సభను తిరుపతిలో ఈ నెల (మే) 11న నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. భారీ ఎత్తున నిర్వహించనున్న ఈ సభకు ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరవుతారు. మాలల హక్కులు, విధులు, సవాళ్లను గురించి ఆయన ప్రసంగిస్తారు. 

ఆదివారం జరగనున్న ఈ సభకు మాలలు భారీగా హాజరై జయప్రదం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మంగళం సమీపంలోని ఆశా కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శుక్రవారం (మే 9) తిరుపతి ప్రెస్ క్లబ్ లో సభ నిర్వహణపై  తీసుకున్న నిర్ణయాలను గురించి మీడియాతో మాట్లాడారు. ఈకార్యక్రమంలో జేఏసీ నాయకులు అశోక రత్నం,  మల్లారపు మధు, జయరాం, దాము, విజయ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.  

మాలల ఆత్మీయ గౌరవ సభకు ఊరువాడల నుండి మాలలు పెద్ద ఎత్తున తరలిరావాలని జేఏసి నేతలు పిలుపునిచ్చారు.  ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, క్రమీలేయర్ తీర్పును రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ముఖ్య అథిదిగా హాజరవుతున్నారని జేఏసి నేతలు వెల్లడించారు..