
ఆంధ్రప్రదేశ్ కాకినాడలో మాలల మహా రణభేరి కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు మాల జేఏసీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఎమ్మెల్యే వివేక్ కు ఘనస్వాగతం పలికారు మాల సంఘాల నేతలు.
రణ భేరీ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి మాల సంఘాల ప్రతినిధులు భారిగా వచ్చారు. తెలంగాణ నుంచి మాలల ఆశాజ్వోతి వివేక్ వెంకటస్వామి ఈ సభకు రావటం ఆనందంగా ఉందని మాల సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆదివారం (మే 11) తిరుపతిలో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే వివేక్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. మాలలు కలిసి కట్టుగా ఉండి హక్కులు సాధించుకోవాలని ఆ సభలో చెప్పారు. మాలలు పోరాడకుంటే అణచివేయాలని చూస్తారని హెచ్చరించారు.