Earthquake : మలాంగో.. సోలమన్ దీవుల్లో భారీ భూకంపం

Earthquake : మలాంగో.. సోలమన్ దీవుల్లో భారీ భూకంపం

మలాంగోలోని సోలమన్ దీవుల్లో భారీ భూకంపం వచ్చింది.  తెల్లవారుజామున 3:49 గంటలకు హోనియారా పశ్చిమ వాయువ్య ప్రాంతంలో భూమికి 95 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ భూకంపం వల్ల ప్రాథమికంగా ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో సునామీ హెచ్చరికలు కూడా ఏమీ జారీ చేయలేదు. తెల్లవారుజామున భూకంపం వచ్చిన టైంలో సోలమన్ దీవుల ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి వచ్చి వీధుల్లో నిల్చున్నారు