హైదరాబాద్‌సిటీ, వెలుగు: మలక్‌పేట కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం ఓ యువకుడి మెదడులో పెరిగిన ప్రాణాంతకమైన కణితిని విజయవంతంగా తొలగించారు. ఖమ్మానికి చెందిన 25 ఏండ్ల యువకుడు కొద్ది రోజులుగా వినికిడి శక్తి తగ్గిపోవడాన్ని గమనించాడు. సరిగ్గా నడవలేకపోతుండడంతో మలక్‌పేట కేర్‌లో పరీక్షలు చేయించుకున్నాడు. హై-రిజల్యూషన్ ఎంఆర్ఐ తీయగా అతడి మెడదడులో కణితి ఉన్నట్టు తేలింది. చికిత్స ఆలస్యమైతే ముఖ పక్షవాతం, శాశ్వత వినికిడి నష్టం, ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉండడంతో క్లిష్టతరమైన సర్జరీ చేసి కణితిని పూర్తిగా తొలగించారు. సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ గంజి ఈ ఆపరేషన్‌చేసి కేవలం మూడు రోజుల్లోనే పేషెంట్‌ను డిశ్చార్జ్ చేశారు.

