
రవితేజ నేల టికెట్టు బ్యూటీ మాళవిక శర్మ రీ ఎంట్రీ ఇస్తోంది. నేల టికెట్ సినిమాతో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత రామ్ మూవీ రెడ్లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో అమ్మడు ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత మాళవిక శర్మకు ఆఫర్లు కరువయ్యాయి. చాలా రోజుల తర్వాత మాళవిక ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. గోపిచంద్ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
తమిళ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా తీస్తున్నాడు. ఇందులో మాళవిక శర్మను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఈ సినిమాపైనే మాళవిక శర్మ ఆశలు పెట్టుకుంది. ఎలాగైన ఈ సినిమా హిట్ అయితే తన కెరీర్ సాఫీగా సాగిపోతుందని భావిస్తోంది.
మరోవైపు ‘రామబాణం’తో డీలా పడ్డ మేచో స్టార్ గోపిచంద్..ఈ సినిమాతో హిట్టు కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇది గోపీచంద్కు 31వ సినిమా కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందించనున్నాడు.
మొత్తానికి అటు మాళవిక శర్మ, ఇటు గోపిచంద్కు హిట్ అవసరం. మరి ఈ సినిమా వీరిద్దరి ఆశలను ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.