Fahad Faasil: మేము ఎన్ని హిట్లు కొట్టినా పట్టించుకోవట్లేదు.. మలయాళ హీరో ఫాహద్ షాకింగ్ కామెంట్స్

Fahad Faasil: మేము ఎన్ని హిట్లు కొట్టినా పట్టించుకోవట్లేదు.. మలయాళ హీరో ఫాహద్ షాకింగ్ కామెంట్స్

మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్(Fahad Faasil) OTTలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము ఎన్ని హిట్స్ కొట్టినా OTT సంస్థలు తమను పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో మిగతా ఇండస్ట్రీల కన్నా దారుణంగా చేస్తున్నారని, ఈ పద్ధతి మారాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఫాహద్ ఫాజిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆవేశం. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో ఫాహద్ ఫాజిల్. ఈ ఇంటర్వ్యూలో ఆయన మలయాళ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ఇటీవల మలయాళ సినిమాల బిజినెస్ చాలా పెరిగింది. వరుసగా ప్రేమలు, మంజుమల్ బాయ్స్ వంటి సినిమాళుళ్ ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఈ రేంజ్ లో సక్సెస్ ఉన్నప్పటికి.. మాకు ఓటీటీ ప్లాట్ సంస్థల నుండి సపోర్ట్ రావడంలేదు.

ఈ విషయంలో మలయాళ ఇండస్ట్రీ తప్ప.. మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో 80 శాతం సినిమాలు రిలీజ్ ముందే OTTల బిజినెస్ జరిగిపోతోంది. కానీ, మలయాళం లో మాత్రం.. సినిమా రిలీజై హిట్ కొడితే తప్ప ఓటీటీ సంస్థలు మా దగ్గరికి రావడంలేదు. దీని వల్లే మంచి సినిమాలు చేయాలనే కసి పెరిగింది.. అంటూ చెప్పుకొచ్చాడు ఫాహద్. ప్రస్తుతం ఫాహద్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వాగుల్లో చర్చనియ్యాంశం అయ్యాయి.