యుద్ధానికి నువ్వు నీ ఆర్మీని తీసుకొచ్చావ్.. నేను అతడిని తీసుకొచ్చా : సలార్ డైలాగ్ లీక్

యుద్ధానికి నువ్వు నీ ఆర్మీని తీసుకొచ్చావ్.. నేను అతడిని తీసుకొచ్చా :  సలార్ డైలాగ్ లీక్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) యాక్టర్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం ఆయన  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న సలార్(Salaar) సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అతను చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సలార్ మూవీ నుంచి ఒక ఇంటెన్సివ్ డైలాగ్ ను లీక్ చేశారు.

ఇవాళ (అక్టోబర్23న) ప్రభాస్ బర్త్ డే సందర్బంగా స్పెషల్ విషెష్ చెబుతూ..'యుద్ధానికి నువ్వు నీ ఆర్మీని తీసుకొచ్చావ్..నేను అతడిని తీసుకొచ్చా - వర్థరాజ మన్నార్' అని ట్వీట్ చేశారు. దీంతో ఆయన చెప్పే డైలాగ్ లీక్ కావడంతో..ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సలార్ మూవీలో పృద్విరాజ్ సుకుమారన్ వర్దరాజా మన్నార్ పాత్రలో నటిస్తున్నారు. 

పృథ్విరాజ్ ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ సలార్ లో కీలక పాత్రలో నటించారు. అంతే కాదు మలయాళంలో పృథ్వి రాజ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి కూడా. ఇప్పుడు లోకేష్ కనగరాజ్..రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.