
ప్రముఖ మళయాళ నటి రెంజుషా మీనన్(Ranjisha menon) ఇటీవల తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రెంజుషా మీనన్ ఆత్మహత్యపై మలయాళ ఇండస్ట్రీ నుండి చాలా మంది స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తమకు రెంజుషా మీనన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు. అందులో నటి బీనా ఆంటోని(Beena antony) ఒకరు.
అయితే ఆమె రెంజుషా మీనన్ మరణంపై బాధపడుతూ చేసిన వీడియోపై కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఫేమ్ కోసమే ఆమె ఈ వీడియో చేశారని ఇష్టమొచ్చినట్లు థంబ్ నెయిల్స్ పెట్టి వీడియో చేశారు. ఆ వీడియోలపై తాజాగా స్పందించారు నటి బీనా ఆంటోని. ఈ విషయంపై ఆమె తన ఇంస్టాగ్రామ్ లో వీడియో బైట్ షేర్ చేశారు.
ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని నెలల నుండి టీవీ పరిశ్రమకు చెందిన రెంజూష, ఆదిత్యన్, అపర్ణా నాయర్, డా ప్రియా వంటి మంచి నటులను, వ్యక్తులను కోల్పోయాం. ఆ షాక్ నుండే ఇంకా కోలుకోలేదు కానీ.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం మాలాంటి వాళ్ళని బలిపశువుల్ని చేస్తున్నాయి. తమ రీచ్ కోసం ఎవరిపై పడితే వారిపై, ఎలా పడితే వీడియోలు చేస్తున్నారు. రెంజూష మృతికి సంతాపంగా నేను ఒక వీడియో చేస్తే.. సెన్సేషన్, పబ్లిసిటీ కోసంమే ఆ వీడియో చేశానని థంబ్ నెయిల్స్ పెట్టారు. అవి చూసి ఆశ్చర్యపోయాను. రీచ్ కోసం ఇంత చీప్‌గా చేస్తారా అని అనిపించింది. ఆ వీడియోలు రెంజూషకి సంబందించిన వాళ్లు చూసి నా గురించి ఏమనుకుంటారు. దయచేసి ఇలాంటివి వీడియోలు చేయడం ఆపండి.. అంటూ ఎమోషనల్ అయ్యారు బీనా ఆంటోని. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.