
కాగజ్ నగర్ వెలుగు: చింతలమానేపల్లి మండలం రవీంద్ర నగర్ 2లోని బాబాపూర్–గంగాపూర్ యూపీఎస్ స్కూల్‌ను సోమవారం పునఃప్రారంభించారు. ‘టీచర్లు లేక సర్కార్ బడి బంద్’ శీర్షికన జూన్27న ‘వెలుగు’లో ప్రచురితమైన వార్తకు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు అదేరోజు స్పందించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎంఈవో జయరాజ్‌ను ఆదేశించగా.. ఆ నివేదిక మేరకు రవీంద్రనగర్2 స్కూల్‌ను రీ ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
దీంతో బాబాపూర్ స్కూల్ నుంచి మల్లేశ్ అనే ఉపాధ్యాయుని కేటాయించి గ్రామంలోని ఏడుగురు విద్యార్థులను జాయిన్ చేశారు. పునఃప్రారంభంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంఈవో, పీజీ హెచ్ఎంలు పెద్దులు, సుదర్శన్ పాల్గొన్నారు. మూతబడిన సర్కార్ బడి రీ ఓపెన్ కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.