
మలయాళ నటి, జై బోలో తెలంగాణ(Jai bolo telangana) మూవీ ఫేమ్ మీరా నందన్(Meera nandan) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే ఆమెకు వ్యాపారవేత్త శ్రీజు(Sreeju)తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్నీ స్వయంగా మీరా నందన్ తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ కొత్త జంటకు నెటిజన్స్ సోసిల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీజు లండన్ లో బిజినెస్ మ్యాన్. ఒక మాట్రిమోనీ సంస్థ ద్వారా పరిచయమైన మీరా,శ్రీజు.. తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. త్వరలోనే ఘనంగా వీరి పెళ్లి జరుగనుంది.
ఇక మీరా నందన్ విషయానికి వస్తే ఆమె.. 2007లో మలయాళంలో వచ్చిన ముల్లా అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆమె తండ్రి నందకుమార్, తల్లి మాయ. మీరా నందన్ ప్రముఖ మలయాళ నటి దివ్య ఉన్నికి బంధువు అవుతారు.
Also Read :- ఒంటరిగా వస్తోన్న విశాల్ మార్క్ ఆంటోనీ..
కేవలం మలయాళంలోనే కాదు.. తెలుగు, కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా నటించారు మీరా నందన్. ఇక తెలుగులో వచ్చిన జైలు బోలో తెలంగాణ సినిమాలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.