
ప్రస్తుతం ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టు ఏదంటే.. రాజమౌళి, మహేష్ బాబు సినిమా అనే చెప్పాలి. కేవలం అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్టు ఇండియన్ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రేంజ్ లో రానుందని టాక్. హాయ్ వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో, హాలీవుడ్ రేంజ్ లో రానున్న ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కథ సిద్ధం అవగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక రాజమౌళి కూడా హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్రతీ చిన్న విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. నటీనటుల విషయంలో కూడా అదే రేంజ్ ను మైంటైన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే ఈ సినిమాలో మహేష్ కు విలన్ గా ఓ స్టార్ హీరోను సెట్ చేయనున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్. ఇప్పటికే ఈ పాత్ర కోసం పృథ్విరాజ్ తో సంప్రదింపులు కూడా జరిపారట మేకర్స్. పాత్ర నచ్చడం, అది కూడా హాలీవుడ్ రేంజ్ మూవీ కావడం, అందులోను రాజమౌళి డైరెక్టర్ అవడంతో వెంటనే ఒకే చెప్పేశాడట పృథ్విరాజ్.
ఇక పృథ్విరాజ్ రాకతో మహేష్, రాజమౌళి సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. పృథ్విరాజ్ లాంటి నటుడు మహేష్ బాబుకి విలన్ అంటే ఊహించుకోవడానికే ఒక రేంజ్ లో ఉందని, ఇక స్క్రీన్ పై ఈ ఇద్దరి ఫెసాఫ్ మాములుగా ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇటీవల పృథ్విరాజ్ ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సలార్ సినిమాలో కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి అనే రేంజ్ మహేష్, రాజమౌళి మూవీలో పృథ్విరాజ్ పాత్ర ఉండనుందని టాక్ నడుస్తోంది.