కరోనా వైరస్ తన ఆకృతిని మార్చుకుంటూ మరింత ప్రమాదంగా మారుతుందని, ప్రతీ ఒక్కరు జాగ్రత్త పడాలని సైంటిస్ట్ లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మలేషియాలో కరోనా వైరస్ దాని ఆకృతిని మార్చుకున్నట్లు ఆదేశ హెల్త్ డైరక్టర్ జనరల్ నూర్ హిషాం అబ్దుల్లా తెలిపారు. వైరస్ ఆకృతికి ‘D614G అని నామకరణం చేసినట్లు చెప్పిన ఆయన..మలేషియాలో ఓ రెస్టారెంట్ యజమానిలో ఆ వైరస్ ఆకృతి ఆనవాళ్లను గుర్తించినట్లు చెప్పారు.
ఇండియా నుంచి మలేషియా వచ్చిన సదరు యజమాని 14రోజుల క్వారంటైన్ లో ఉండలేదని, తద్వారా మరింతమందికి ఆ కొత్త వైరస్ సోకినట్లు చెప్పారు.
అదే ఆనవాళ్లు ఫిలిప్పీన్స్ నుంచి మలేషియాకు వచ్చిన కొంతమందిలో ఉన్నట్లు తాము గుర్తించినట్లు నూర్ హిషాం వెల్లడించారు.
ఫలితంగా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు అసంపూర్తిగా లేదా అసమర్థంగా ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని మలేషియా హెల్త్ డైరక్టర్ జనరల్ నూర్ హిషాం అబ్దుల్లా కోరారు.
