
మలేసియా మాస్టర్స్‌లో భారత ఏస్ షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లు క్వార్టర్‌ఫైనల్‌లో దూసుకెళ్లారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మరియు ఆరో సీడ్ సింధు మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన అయా ఒహోరిని 21-16, 21-11 తేడాతో వరుస గేమ్‌లలో చిత్తు చేసింది. కేవలం 40 నిమిషాలలో ఈ గేమ్ ముగిసింది. క్వార్టర్స్‌లో సింధు చైనాకు చెందిన యీ మాన్ జాంగ్‌తో తలపడనుంది.
మరో గేమ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ చైనాకు చెందిన షి ఫెంగ్ లీపై పోరాడి గెలిచాడు. గంట 10 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ 13-21 తేడాతో తొలి సెట్‌ను కోల్పోయాడు. అనంతరం 21-16, 21-11 తేడాతో వరుస సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించాడు. ప్రణయ్ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోతో తలపడనున్నాడు. మరో హోరాహోరీ మ్యాచులో కిదాంబి శ్రీకాంత్ 21-19, 21-19 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ విటిద్‌సర్న్‌పై విజయం సాధించాడు. శ్రీకాంత్ క్వాలిఫైయర్ పోరులో ఇండోనేషియాకు చెందిన క్రిస్టియన్ అదినాటాతో తలపడనున్నాడు.