ఉన్న ఒకే ఒక్క రైనో చచ్చిపోయింది

ఉన్న ఒకే ఒక్క రైనో చచ్చిపోయింది

ప్రపంచంలోని ఐదు రకాల ఖడ్గమృగాల్లో సుమత్రా రైనో ఒకటి. అన్ని రైనోల్లోకెల్లా పొట్టిగా ఉంటుంది. రెండు కొమ్ములుంటాయి. అదే మిగతా వాటికీ, దానికి ఉన్న తేడా. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒకే ఒక్క సుమత్రా రైనో ఉండేది. దాని పేరు ఇమాన్​. శనివారంతో దాని కథ కూడా ముగిసిపోయింది. చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇమాన్​, ఇండొనేసియాలోని బోర్నియా దీవుల్ల ఉన్న ఈస్టర్న్​ సాబా రాష్ట్రంలో అది చనిపోయింది. దాంతో సుమత్రా రైనోల కథ అంతమైపోయింది. 2014 మార్చిలో దానిని పట్టుకున్న దగ్గర్నుంచి మూత్రాశయ ట్యూమర్లతో బాధపడుతోందని ఇండొనేసియా వైల్డ్​లైఫ్​ డిపార్ట్​మెంట్​ డైరెక్టర్​ ఆగస్టిన్​ టూగా చెప్పారు.

ట్యూమర్లు పెరుగుతున్నకొద్దీ 25 ఏళ్ల ఇమాన్​ మూత్రాశయంపై ఒత్తిడి పెరిగిందని, అయితే, ఇంత తొందరగా అది చనిపోతుందని అనుకోలేదని అన్నారు. ఒక మగ రైనో చనిపోయి ఆరు నెలలు కాకముందే ఇమాన్​ చనిపోయిందన్నారు. అంతకుముందు 2017లో మరో ఆడ రైనో కూడా చనిపోయిందని వివరించారు. కాగా, సుమత్రా రైనోలను బతికించాలన్న ఉద్దేశంతో ఇమాన్​ అండ కణాలను వైల్డ్​లైఫ్​ అధికారులు సేకరించారు. వాటితో మళ్లీ రీప్రొడక్షన్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చాలా సార్లు ఇమాన్​ చావు నుంచి తప్పించుకుందని సాబా డిప్యూటీ సీఎం క్రిస్టినా ల్యూ అన్నారు. ఒకప్పుడు ఇండియా సహా ఆసియా మొత్తం ఈ సుమత్రా రైనోలు తిరిగేవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం 24,500 రైనోలు అడవుల్లో,  మరో 1,250 రైనోలు జూలలో ఉన్నాయి.