
ముషీరాబాద్ సత్తర్ బాగ్కు శుక్రవారం ఏడు భారీ దున్నలు చేరుకున్నాయి. హర్యానా, పంజాబ్ నుంచి వీటిని తీసుకొచ్చినట్లు స్థానిక నేత ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. బాద్షా, కోహినూర్, గోల్, బజరంగి, రిలాక్స్ తదితర పేర్లతో పిలిచే ఈ దున్నలను నారాయణగూడలో జరిగే సదర్ వేడుకల్లో ప్రదర్శించనున్నట్లు చెప్పారు.