- పురుషుల్లో తగ్గుతున్న సంతాన సామర్థ్యం
- రాష్ట్రంలో15 నుంచి 20 శాతం పెరిగిన మేల్ ఇన్ఫర్టిలిటీ కేసులు
- మారుతున్న జీవనశైలితో లోపిస్తున్న లైంగిక పటుత్వం
- జనరేషన్ జెడ్ వాళ్లలోనూ ఇదే సమస్య
- సమస్యను త్వరగా గుర్తిస్తేనే సమర్థంగా చికిత్స చేయొచ్చంటున్న డాక్టర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: పురుషుల్లో మేల్ ఇన్ఫర్టిలిటీ (సంతానరాహిత్యం) క్రమంగా పెరుగుతోంది. కొన్నాళ్లుగా మన రాష్ట్రంలో ఈ కేసులు15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని హైదరాబాద్ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ డాక్టర్లు స్పష్టం చేశారు. మొత్తం వంధ్యత్వ కేసుల్లో 30 నుంచి 50 శాతం వరకు పురుషులవే ఉంటున్నాయని చెప్తున్నారు. మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, నిద్ర లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి పెరగడం, పర్యావరణ అంశాల ప్రభావం వంటి కారణాల వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతోందంటున్నారు. అయితే, వారు సమస్యలున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని, సిగ్గు, ఒత్తిడి, సమయం లేకపోవడం వంటి కారణాలతో డాక్టర్లను కలవడం లేదని చెప్తున్నారు. ఒకవేళ కలిసినా అసలు విషయం చెప్పడానికి ఇబ్బందులు పడుతున్నారని, దీంతో సమస్య పరిష్కారం కావడంలేదని అంటున్నారు.
అసలేంటీ మేల్ఇన్ ఫర్టిలిటీ?
పురుషుడు లైంగిక సామర్థ్యాన్ని కోల్పోవడమే మేల్ఇన్ఫర్టిలిటీ(పురుష వంధ్యత్వం). ఈ సమస్యను ఎదుర్కొంటున్న పురుషుడు తండ్రి అయ్యే అవకాశాన్ని కోల్పోతాడు. ఇందులో ఎక్కువగా స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం, స్పెర్ప్సైజ్లో, కదలికల్లో మార్పులు, అంగస్తంభన వంటి సమస్యలు కూడా ఉంటాయి. కావాల్సినంత టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల కాకపోవడం కూడా సమస్యగా మారుతుంది. దీనివల్ల సంతానం కలగదు. అయితే, పిల్లలు పుట్టకపోవడానికి కారణం వాళ్లేనన్న నిజాన్ని చాలా మంది పురుషులు అంగీకరించడం లేదు.
కొన్ని సందర్భాల్లో భర్తలను భార్యలు బలవంతంగా హాస్పిటల్స్‌కు తీసుకువెళ్లి స్పెర్మ్కౌంట్చెక్చేయిస్తే కొందరిలో అతి తక్కువ కౌంట్నమోదవుతోంది. మరికొందరిలో స్పెర్మ్కౌంట్జీరోగా కూడా చూపిస్తోంది. మరికొందరి స్పెర్మ్కదలికలుకావాల్సినంత వేగంగా ఉండడం లేదని తేలుతోంది. అలాగే స్పెర్మ్ తగినంత క్వాలిటీగా లేకపోవడం కూడా సమస్యగా మారుతోంది. పురుషుల్లో ఈ పరిస్థితిపై బంజారాహిల్స్‌లోని ఏఐఎన్‌యూ సెంటర్ ఫర్ మెన్స్ హెల్త్ అండ్ ఆండ్రాలజీకి చెందిన యూరాలజిస్ట్అండ్ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సూరజ్ పిన్ని మాట్లాడుతూ.. మగవారిలో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నవారు చాలా మందే ఉన్నారని తెలిపారు. సమస్య ఎక్కువయ్యే వరకు వేచి చూడకుండా డాక్టర్లను సంప్రదిస్తే బాగవుతుందన్నారు. మందులతో పాటు జీవనశైలి మార్పులతో మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు.
జెన్ జీల్లోనూ ఇదే తీరు
జెన్‌జీ(జనరేషన్జడ్..1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) వారిలోనూ ఆధునిక జీవితం పెను మార్పులు తెస్తోంది. జెన్జీల్లోనే మేల్ఇన్ఫర్టిలిటీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. గంటలు గంటలు కూర్చొని పనిచేయడం, ఫాస్ట్‌ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ తీసుకోవడం, నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, ఎక్కువ స్ర్కీన్ టైం, అంటే మొబైల్స్వాడడం వల్ల రేడియేషన్ఎఫెక్ట్, హార్మోనల్ఇంబ్యాలన్స్, కోరికలు కలగకపోవడం వంటివి కారణమవుతాయని అంటున్నారు. ఇవి మెల్లమెల్లగా సంతానోత్పత్తి వ్యవస్థను నాశనం చేస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే జెన్జీల్లో వయసుకు తగిన హార్మోన్లు కనిపించడం లేదని ఓ డాక్టర్ చెప్పారు. అయితే మేల్ఇన్ఫర్టిలిటీ సమస్యను 30 ఏండ్లలోపు గుర్తిస్తే అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. 35–40 దాటితే కొంత కష్టమవుతుందని సూచిస్తున్నారు.
ఎయిర్పొల్యూషనూ కారణమే?
మగవారిలో లైంగిక సామర్థ్యం ముఖ్యంగా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సమస్యకు పర్యావరణ అంశాలు కూడా కారణమవుతున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. నగరంలో హెవీ ట్రాఫిక్, వాహనాల పొగ, ఫ్యాక్టరీలు ముప్పుగా పరిణమిస్తున్నాయి. అందులో నుంచి వెలువడే నైట్రోజన్డైయాక్సైడ్, ఓజోన్(ఓ3), కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్డయాక్సైడ్అంగస్తంభన సమస్యను కలగజేస్తున్నాయి.సైంటిఫిక్రీసెర్చ్ప్రకారం వాయు కాలుష్యంలోని కెమికల్స్శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు గురి చేస్తున్నాయి. రక్తనాళాలు దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతున్నాయి. రక్త ప్రసరణ తగ్గడం, నైట్రిక్ ఆక్సైడ్ లభ్యత తగ్గడంతో లైంగిక సామర్థ్యం దెబ్బతింటోందని అంటున్నారు.
సిగ్గు పడకండి.. మాట్లాడండి
మేల్ఇన్ఫర్టిలిటీ భారిన పడకుండా పురుషులు ముందే అలర్ట్ కావాలి. అధిక మానసిక ఒత్తిడి, సిగ్గు వల్ల ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. డాక్టర్లకు కూడా చెప్పడానికి సిగ్గు పడుతున్నారు. ముందే గుర్తించి డాక్టర్లను సంప్రదించడం ద్వారా సమస్యను తొందరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికే మేం మా హాస్పిటల్లో పురుషుల సమగ్ర వెల్‌నెస్ ప్రోగ్రాం ప్రారంభించాం. ఇందులో పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం (ఇన్ ఫర్టిలిటీ), లైంగిక పటుత్వం లోపించడం లాంటి సమస్యలపై దృష్టి సారించాం.
- డాక్టర్ పూర్ణచంద్రా రెడ్డి, ఏఐఎన్‌యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ యూరాలజిస్ట్
పూజ, రాహుల్ (పేర్లు మార్చాం) యువ దంపతులు. మూడేండ్ల కిందట పెండ్లయ్యింది. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, ఇన్‌కం కూడా బాగా ఉండడంతో జూబ్లీహిల్స్‌లోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్లో ఆనందంగా ఉంటున్నారు. కానీ, వారికి పిల్లలు పుట్టడం లేదు. దీంతో పూజలోనే లోపం ఉందంటూ ఆమెను డాక్టర్‌కు చూపించాడు రాహుల్. లోపం ఏమీ తేలకపోయినా కొన్ని మందులు ఇచ్చి పంపించాడు డాక్టర్. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో ఈసారి ఇద్దరూ వెళ్లి డాక్టర్ ను కలిశారు. రాహుల్ కు పరీక్షలు చేయగా అతనిలోనే లోపం ఉందని తేలింది. అతనికి స్పెర్మ్‌కౌంట్ జీరో వచ్చిందని, ఆ సమస్య వల్లే పిల్లలు పుట్టడం లేదని కన్ఫమ్అయ్యింది. ఇది ఒక్క రాహుల్ పరిస్థితే కాదు.. రాష్ట్రంలో చాలా మంది పురుషుల సమస్య ఇలాగే ఉందని డాక్టర్లు చెప్తున్నారు.
