ఒకే కాన్పులో 9 మంది శిశువులు..

ఒకే కాన్పులో 9 మంది శిశువులు..

సాధారణంగా మహిళలు ఒక కాన్పులో ఒక్కరికి జన్మనివ్వాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడతారు. చావు అంచులదాకా వెళ్లివస్తారు. అయినా కూడా ఆ నోప్పులన్నీ భరించి.. బిడ్డకు జన్మనిస్తారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో మహిళలు ఒకరిని కనడానికే నానాయాతన పడుతుంటే.. ఒక మహిళ మాత్రం ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన మాలి దేశంలో జరిగింది. 

మాలిలోని వెస్ట్ ఆఫ్రికా దగ్గర్లో నివసిస్తోన్న 25 ఏళ్ల హలీమా సిస్సే అనే మహిళ డెలివరీ కోసం వారికి సమీపాన ఉన్న మొరాకోకు మార్చి 30న వెళ్లింది. ఆ మహిళ మంగళవారం మే 4న మొరాకోలో నాన్‌ప్లెట్స్‌కు జన్మనిచ్చింది. అందులో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారని మాలి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. మాలి మరియు మొరాకో రెండింటిలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షలలో సిస్సే ఏడుగురు శిశువులను మోస్తున్నట్లు మాలి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డెలివరీ తర్వాతే సిస్సే కడుపులో 9 మంది ఉన్నట్లు తెలిసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

తల్లి మరియు పిల్లలు ఇప్పటివరకు బాగానే ఉన్నారని మాలి ఆరోగ్య మంత్రి ఫాంటా సిబి చెప్పారు. సిస్సేతో కలిసి మొరాకోకు వెళ్లిన మాలియన్ వైద్యుడు తనకు సమాచారం ఇచ్చారని మంత్రి తెలిపారు. సిస్సే మరియు పిల్లలు కొన్ని వారాల వ్యవధిలో స్వదేశానికి తిరిగి రానున్నారని సిబి తెలిపారు. 

మొరాకో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి రచిద్ కౌదరి మాట్లాడుతూ.. దేశంలో ఇటువంటి అరుదైన డెలివరీ జరిగినట్లు తనకు తెలియదని కౌదరి తెలిపారు.