ప్రాణాంతక వ్యాధి కబలిస్తోంది..  చిన్నారిని కాపాడండి

ప్రాణాంతక వ్యాధి కబలిస్తోంది..  చిన్నారిని కాపాడండి
  • తమ బేబి వేదికను కాపాడమంటూ దాతలను వేడుకుంటున్న తల్లిదండ్రులు
  • రూ.16కోట్ల ఖరీదైన మందులు వాడితే బతుకుతుందన్న వైద్యులు
  • చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టిన ‘మిలాప్’ 
  • చిన్నారి వైద్య ఖర్చులకు డబ్బు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్న మిలాప్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్

‌సరైన వైద్యం అందక ఎవరైనా చనిపోయారని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ప్రాణాంతక వ్యాధితో ఎవరైనా పోరాడుతున్నారన్న విషయం తెలిసినా మనసు కలతచెందుతుంది. ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేక రోజు రోజుకూ చావుకు దగ్గరవడం.. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికే కాదు.. ఆ విషయం తెలిస్తే ఎవరికైనా సరే హృదయం ద్రవించిపోతుంది. సరైన వైద్యం అందక మరణించారనే వార్త ఎంతటి వారినైనా కలచివేస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోతున్న పాపది సైతం ఇలాంటి విపత్కర పరిస్థితే. ఈ పాపకు సరైన  సమయంలో సరైన వైద్యం అందకపోతే మృత్యువు కబలిస్తుంది. ఇదంతా చదువుతుంటే.. రెండు నెలల క్రితం సంఘటన గుర్తుకు వస్తుంది కదూ..

5 నెలల తీరా కామత్ కు రూ.16 కోట్ల ఇంజెక్షన్

ముంబైలో..వింత వ్యాధితో బాధపడుతున్న తీరా కామత్ అనే 5 నెలల చిన్నారి బతకాలంటే రూ.16 కోట్ల ఇంజెక్షన్ వేయాలంటూ వైద్యులు చేసిన ప్రకటనలు.. ఈ డబ్బు కోసం చిన్నారి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడడం.. సోషల్ మీడియా వేదికగా క్రౌడ్ ఫండింగ్ చేసి డబ్బులు సమకూర్చున్న విషయం తెలిసిందే. చిన్నారి ప్రాణాలు కాపాడడం కోసం ప్రపంచ వ్యాప్తంగా దాతలు తలా ఒక చేయి వేయడంతో గత ఫిబ్రవరి నెలలో అమెరికా నుండి ఇంజెక్షన్ తెప్పించి వేశారు. ప్రస్తుతం చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటోంది. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం ఉన్న వారిని కదిలించడమే కాదు...సంఘటిత శక్తిని చాటింది. చేయిచేయి కలిపి ఓ నిండు ప్రాణం నిలబెట్టేందుకు దోహదపడిన ఈ ఘటన మనుషుల మధ్య బంధాలకు దేశాలు.. ఎల్లలు ఇవేవీ అడ్డంకి కాబోదని రుజువు చేసింది. చలి చీమలంతా కలసి.. బలవంతమైన పామును చంపిన చందంగా.. చిన్నారిని కబళిస్తున్న ప్రాణాంతక రోగాన్ని పారదోలేందుకు ప్రపంచవ్యాప్తంగా మానవత్వం ఉన్న వారంతా చేతులు కలపడం చారిత్రాతక ఘట్టం. ఈ ఘటన ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకునే వారికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించి కొత్త ఆశలు రేపింది. ఈ నేపధ్యంలో ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న మరో బాలిక కోసం క్రౌడ్ ఫండింగ్ మొదలైంది. 

పుణెకు చెందిన 8 నెలల చిన్నారి బేబి వేదికను కబలిస్తున్న ప్రణాంతక వ్యాధి

బేబీ వేదిక వయసు 8నెలలు. అత్యంత అరుదైన, భయంకరమైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ టైప్‌ 1 (ఎస్‌ఎంఏ)తో ఆమె బాధపడుతోంది. ఇది అత్యంత భయంకరమైన వ్యాధి. సరైన చికిత్స అందించకపోతే ఇది పాపను దివ్యాంగురాలిగా మార్చడమే కాదు, అంతిమంగా ఆ పాప తినడం, మింగడం లేదా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మార్చివేస్తుంది. రోజులు గడిచేకొద్దీ బతుకు దినదినగండంగా మారుతుంది. పూణెకు చెందిన ఆమె తల్లిదండ్రులు సౌరభ్‌ షిండే ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. తమ చిన్నారి స్ధితిని చూసి ఏడ్వని క్షణం లేదు. చిన్నారి చిరునవ్వుతో తమ దగ్గరకు రావాలని చేసే ప్రయత్నం హృదయాలను బరువెక్కిస్తుంది. తమ చిన్నారి పాప చికిత్స కోసం వారు చేయని ప్రయత్నమంటూ లేదు. తమ చిన్నారి మోములో చిరునవ్వులను శాశ్వతంగా చూడాలనే సంకల్పంతో సర్వస్వమూ ఆమె కోసమే ఖర్చు చేశారు. ఆస్తులన్నీ అమ్మేసి.. అందినంత అప్పులు చేసి వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. 

విధి విచిత్రమైనది.. చికిత్సకు ఒకటే మార్గం

ప్రస్తుతం డాక్టర్లు బేబీ వేదిక చికిత్సకు ఒకే ఒక్క మార్గముందని ఆమె తల్లిదండ్రులకు సూచించారు.  జోల్జెన్స్మా ఔషద సహాయంతో జీన్‌ మార్పిడి చికిత్స ద్వారా చిన్నారి ఆరోగ్యం మెరుగు పరిచేందుకు అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని వెల్లడించారు. ఇది నమ్మశక్యం కానప్పటికీ, ఈ ఔషధం ధర 16 కోట్ల రూపాయలు. దీనిని అమెరికా (యుఎస్)‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంత మొత్తం వెచ్చించగలడా ? అయినా తమ పాపను బ్రతికించుకోవాలన్న ఆరాటం వారిని తమ ప్రయత్నాలను కొనసాగించేలా చేసింది. మిలాప్‌ దానికి వేదిక అయింది.తమ పాప ప్రాణాలను కాపాడుకునేందుకు వారు మిలాప్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించారు. ఈ ఫండ్‌ రైజర్‌ ద్వారా భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఆపన్నులకు చేరువై తమ పాప ప్రాణాలను కాపాడమని అభ్యర్థిస్తున్నారు.

బేబీ వేదిక ప్రాణాలను కాపాడేందుకు దయచేసి ముందుకు రండి... ఉదారంగా విరాళాలనివ్వండి !

ఈ పాపకు విరాళం అందించడం కోసం ఈ లింక్‌ను నొక్కండి.http://bit.ly/save-vedika-ts-ap.

Name:                     Sneha Shinde
A/C number:           2223330026924565
IFSC Code:            RATN0VAAPIS
Bank name:            RBL