- మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్నినో నేపథ్యంలో వర్షాలు లేకపోవడం, నీటి ముప్పును తప్పించడం కోసం నిర్మాణ పనులు, పార్కులు, పచ్చదనం నిర్వహణకు ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీళ్లను వాడాలని మల్కాజిగిరి మున్సిపల్కార్పొరేషన్కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు.
గురువారం వాటర్ బోర్డు ఆఫీసర్లతో కో ఆర్డినేషన్మీటింగ్నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ఇండ్లు, షాపులు, కన్స్ట్రక్షన్ఫీల్డ్తో పాటు పార్కుల్లో నీటి వృథాను తగ్గించేలా అవగాహన కల్పించాలన్నారు. అడిషనల్కమిషనర్ రఘు ప్రసాద్, జలమండలి ఈడీ పంకజ, ఎంఎంసీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ శ్రీనివాసరావు, చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్కుమార్, యూబీడీ డైరెక్టర్ సునంద, పీడీ యూసీడీ సురేష్ పాల్గొన్నారు.
