ఎల్బీనగర్, వెలుగు: మహిళలు, బాలికల భద్రతపై మల్కాజ్‌గిరి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని విమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి బుధవారం తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 46 రోజుల్లో మహిళలను వేధించిన 176 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. వీరిలో 11 మందిపై క్రిమినల్ కేసులు, 71 మందిపై పెట్టీ కేసులు నమోదు చేసి, 104 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. పట్టుబడినవారిలో 134 మంది మేజర్లు, 42 మంది మైనర్లు ఉన్నారు.
