దీపావళి వేడుకల్లో అపశృతి.. భార్యను కాపాడబోయి భర్త మృతి

దీపావళి వేడుకల్లో అపశృతి.. భార్యను కాపాడబోయి భర్త మృతి

మేడ్చల్ మల్కాజ్ గిరిలో దీపావాళి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రేమ్ విజయానగర్ కాలనీలోని  వెంకటేశ్వర్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న  రాఘవరావు అతని సతీమణి రాఘవమ్మ  కలిసి పండుగ సందర్భంగా ఇంటి దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు.   ఈ క్రమంలో భార్య రాఘవమ్మ దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ ఆమె చీరకు నిప్పు అంటుకుంది.  వెనక మంచం పైనున్న భర్త రాఘవయ్య తన భార్యను కాపాడే ప్రయత్నం చేయగా ఆయనకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రాఘవయ్య  అక్కడిక్కడే మృతి చెందగా.. రాఘవమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. 

80 శాతం గాయాలైన ఆమెను  గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.