మంత్రి కోడలిగా ఇది నా బాధ్యత

మంత్రి కోడలిగా ఇది నా బాధ్యత

సికింద్రాబాద్: కరోనా వైరస్ ను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ డాక్టర్ CH. ప్రీతి రెడ్డి. అందులో భాగంగానే  రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కోడలిగా.. డాక్టర్ గా కరోనా వైరస్ ను అరికట్టే విధానంలో తన వంతు బాధ్యతని నిర్వహిస్తున్నాని చెప్పారు.

పదవ తరగతి పరీక్షల సందర్భంగా కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని ప్రీతి రెడ్డి గురువారం విద్యార్థులకు మాస్క్ లను పంపిణీ చేశారు. వైరస్ ని అరికట్టేందుకు తన వంతుగా మాస్క్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ ఇతర దేశాలల్లో ఉన్నట్లు మన దేశంలో, రాష్ట్రంలో లేదని, ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించదని ఆమె అన్నారు.  తుమ్మెటప్పుడు, దగ్గేటప్పుడు చేతి రుమాలు, టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవాలని, అవసరం ఉన్నా, లేకున్నా మొఖాన్ని చేతితో తాకొద్దని చెప్పారు.

అలాగే చేతులను ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు సబ్బుతో శానిటేషన్ చేసుకోవాలని కోరారు ప్రీతి రెడ్డి. వైరస్ వల్ల భయపడక్కర్లేదని, నివారణ చర్యలు పాటిస్తే మన దరిచేరదని ఆమె చెప్పారు. జలుబు, జ్వరం వచ్చినప్పుడు భయపకుండా డాక్టర్స్ ను తప్పకుండా సంప్రదించాలని పేర్కొన్నారు.