మల్లారెడ్డి అమెరికాలో కూడా పోటీ చేయగలడు

మల్లారెడ్డి అమెరికాలో కూడా పోటీ చేయగలడు
  • మాజీ మంత్రిపై బీఆర్ఎస్​ లీడర్ల సరదా కామెంట్స్​ 

ఎల్ఎండీ పర్యటనలో మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యే కేటీఆర్ సహా బీఆర్‌‌‌‌ఎస్‌‌ మాజీ మంత్రులు జోకులు వేశారు. డ్యాంపై ఉన్న ఇరిగేషన్ ఆఫీసులో ఛాయ్ తాగుతుండగా మాజీ మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్వర్​రెడ్డి మధ్య జరిగిన సరదా సంభాషణ అందరికీ నవ్వులు తెప్పించింది. ‘మల్లారెడ్డి నా కారులో రావడంతో టైమ్ తెలియకుండా జర్నీ గడిచిపోయింది’ అని కేటీఆర్ అనడంతో.. ‘ఈసారి మీ కారులో కూర్చుంటా’అని సునీతా లక్ష్మారెడ్డి, సబితారెడ్డిని ఉద్దేశించి మల్లారెడ్డి అన్నారు. 

‘అబ్బో.. మల్లారెడ్డికి మామూలు ఫాలోయింగ్ లేదు. అమెరికాలో పోటీ చేసేంత పరపతి ఉంది’ అని సబితా ఇంద్రారెడ్డి సరదాగా అనడంతో.. వెంటనే గంగుల కమలాకర్  ‘ఈసారి అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్‌‌తో కలిసి మల్లారెడ్డి పోటీ చేయాలనుకున్నారు’ అంటూ మరో జోకు వేశారు. ‘పోటీ చేసేవాడే కానీ, బాగుండదని ఆగిపోయాడు’అంటూ కేటీఆర్ పంచ్ వేశారు. వెంటనే వేముల ప్రశాంత్ రెడ్డి అందుకుంటూ ‘మనకు కష్టమవుతదని ఊర్కున్నాడు గానీ.. లేకుంటే పోటీ చేసేవాడే’ అంటూ జోక్‌‌ చేయడంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు.