
మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లి బజార్ ఘాట్ మల్లేపల్లిలోని శ్రీ లక్ష్మీదేవి పెద్దమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఆలయంలో సోమవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మంత్రిని శాలువాతో సన్మానించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాంపల్లి కాన్టెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్, సైనిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు కలకోటి సత్యనారాయణ భీమ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సుశీల్ కుమార్, ఉపాధ్యక్షులు సురేష్, కరణ్ సింగ్, సభ్యులు నాగరాజ్, విమల్ కుమార్, శివకుమార్, నాయకులు మన్మోహన్ ఉన్నారు.