పేదలకు ప్రతినెలా రూ.5 వేలు : ఏపీలో కాంగ్రెస్ తొలి హామీ

పేదలకు ప్రతినెలా రూ.5 వేలు : ఏపీలో కాంగ్రెస్ తొలి హామీ

అనంతపురం జిల్లా కేంద్రంలో  న్యాయ సాధన సభ పేరుతో కాంగ్రెస్​ ఎన్నికల శంఖారావం పూరించింది. . ఈ సభలో  AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఒక పథకం గురించి చెప్పడానికి  వచ్చానన్నారు.  ఈ ఎన్నికల్లో ఒక గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చానని తెలిపారు.  కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి  ఇందిరమ్మ అభయం గ్యారెంటీ ఇస్తున్నానంటూ... ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు  ఇస్తామని చెప్పారు.  ఆంధ్ర ప్రజలకు పదేళ్లుగా అన్యాయం జరిగిందన్నారు.  దేశం గర్వించే  వైఎస్​ రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప నాయకుడిని అందించిందన్నారు.  అందుకే మహానాయకుడి బిడ్డకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించామంటూ.... షర్మిల నాయకత్వం బలపరుద్దామని ఖర్గే అన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని, తప్పకుండా అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.

మోదీకి కాంగ్రెస్​ అంటే భయం పట్టుకుందని... అందుకే రాహుల్​, సోనియాలపై తిట్ల దండకాన్ని చదువుతున్నారని విమర్శించారు. మోదీ పచ్చి అబద్దాలు చెపుతూ... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.   దేశానికి అన్నీ మోదీనే తెచ్చాడని అంటున్నాడని ... చివరకు సూర్యుడిని కూడా ఆయనే తెచ్చాడని చెబుతాడని ఖర్గే అన్నారు.  -ఆహార భద్రత చట్టాన్ని కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందని  తెలిపారు .కేంద్రంలో అధికారంలో మోదీ  కాంగ్రెస్​ జపం చేస్తూ... దేశంలో కాంగ్రెస్​ పార్టీ లేదని చెబుతూనే ....కాంగ్రెస్​ అధికారంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో దేశానికి, రాజ్యాంగానికి ముప్పు వాటిల్లిందన్నారు. నియంత పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.  

దేశానికి మోడీ చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. మోడీ ధనికుల కోసమే పని చేస్తున్నాడని మండిపడ్డారు.  ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ అని అన్నారు.  మోడీ ఈ దేశాన్ని మోసం చేస్తుంటే... చంద్రబాబు,పవన్ జీ హుజూర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీ అధికారంలో వస్తే  విదేశాల్లో ఉన్న బ్లాక్ మని తెచ్చి..  ఒకొక్కరికి బ్యాంక్ లో 15 లక్షలు వేస్తా అన్నారు.  కాని మోదీ ప్రభుత్వం వచ్చి పదేళ్లు అయినా ఒక్క రూపాయి కూడా ఈ దేశానికి రాలేదు కాని ... అన్ని రకాల పన్నులు వేసి.. పెట్రోల్ ధరలు భారీగా పెంచాడన్నారు. వైఎస్సార్ హయాంలో నేరుగా ప్రధాని,సోనియా లతో మాట్లాడే వారు.. నేరుగా తలుపు తట్టే వారు. రాష్ట్ర హక్కులను సాధించే వారు. ఇప్పటి ముఖ్యమంత్రులు మోడీ నీ ఎన్ని సార్లు కలిశారు ?కలిసినా ఉపయోగం ఏంటి ?  రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే...ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో రావాలన్నారు.