రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది విరుద్ధం: రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీకి ఖర్గే లేఖ

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది విరుద్ధం: రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీకి ఖర్గే లేఖ

ఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ జాతీయాద్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమిలి ఎన్నికల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు కమిటీ చైర్మెన్  రామ్‌నాథ్‌ కోవింద్ కు ఆయన లేఖ రాశారు. పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే.. ఈ ఆలోచనను వీడాలన్నారు.

"రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా కమిటీ ఛైర్మన్‌ తన వ్యక్తిత్వాన్ని.. మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు కేంద్రాన్ని అనుమతించవద్దు. పార్టీ, దేశ ప్రజల తరఫున ఈమేరకు అభ్యర్థిస్తున్నా." అని ఖర్గే పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నికల వంటి అప్రజాస్వామిక ఆలోచనల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించకుండా.. వారి ఆదేశాన్ని గౌరవించేలా ప్రభుత్వం, పార్లమెంట్, ఎన్నికల సంఘం కలిసి పని చేయాలన్నారు.