మోదీ, కేసీఆర్ కలిసి వచ్చినా.. కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఖర్గే

మోదీ, కేసీఆర్ కలిసి వచ్చినా.. కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఖర్గే

మోదీ, కేసీఆర్ కలిసి వచ్చినా.. తెలంగాణ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. 2023, నవంబర్ 17వ తేదీ శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ చీఫ్  మల్లిఖార్జున్ ఖర్గే 'అభయ హస్తం' పేరుతో  కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేనిఫోస్టోలోని అన్నీ అంశాలను అమలను చేస్తామన్నారు.

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ, కేసీఆర్ లు ఇద్దరు ఒక్కటేనని.. ఇద్దరు కలిసి వచ్చినా..కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని.. తెలంగాణ ప్రజల పోరాటాన్ని గౌరవించి.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. మిగులు బడ్జెత్ తో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల తెలంగాణగా మార్చందని ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చి ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని.. అయినా, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఖర్గే చెప్పారు.