
కాంగ్రెస్ వ్యవసాయ డిక్లరేషన్ తో.. టీఆర్ఎస్, బీజేపీ లు ఉలిక్కి పడుతున్నాయన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నాయని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ పై రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ రావడంలో కీలకంగా వ్యవహరించిన రాహుల్ గాంధీని.. కేటీఆర్ అవమానించేలా మాట్లాడటం బాధకరమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు మల్లు రవి. టీఆర్ఎస్, బీజేపీ చిల్లర మాటలు మానుకోకపోతే తగిన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు తప్పదన్నారు.