గ్యారంటీల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారు: మల్లు రవి

గ్యారంటీల అమలుతో  ప్రజలు సంతోషంగా ఉన్నారు: మల్లు రవి

న్యూఢిల్లీ :  కాంగ్రెస్ గ్యారంటీల అమలుతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా, ప్రజా పాలన దిశగా సాగుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. 

అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందని చెప్పారు. గ్యారంటీల అమలు తీరును ఖర్గే కు వివరించానని పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 10  నుంచి 14 స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపారు.