
హైదరాబాద్: డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుందని, 70 నుంచి 80 సీట్లతో అధికారంలోకి వస్తామని పీసీసీ సీనియర్ నేత మల్లు రవి చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వారంతా రేవంత్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారని, ఆయన కూడా సీఎం అవుతారనే చర్చ ఉందని, కానీ రేవంత్ కే అవకాశాలు ఎక్కువన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయనున్నట్టు మల్లు రవి చెప్పారు.