ఇంటర్ ఫస్టియర్లో 35 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

ఇంటర్ ఫస్టియర్లో 35 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షల్లో 35 మంది స్టూడెంట్లపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా నుంచి 26 మంది ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడుగురు, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా,ఫస్టియర్​లో 1,74,801 మంది పరీక్షలు రాశారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్​పరీక్షల్లోనూ ఏడుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.