బెంగాల్ ను టార్గెట్ చేయడం అంత ఈజీ కాదు

బెంగాల్ ను  టార్గెట్  చేయడం అంత ఈజీ కాదు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్ ను టార్గెట్ చేయాలంటే..  ముందు రాయల్ బెంగాల్ టైగర్ తో పోరాడాలని ఆమె హెచ్చరించారు. మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్, చత్తీస్ గడ్, బెంగాల్ లో పాగా వేసిందుకు బీజేపీ  ప్రయత్నిస్తుందని.. కానీ బెంగాల్ లో పాగా వేయడం అంత ఈజీ కాదని అన్నారు.

2024లో బీజేపీ అధికారంలోకి రాదని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి పనిలేదని.. మూడు, నాలుగు  ఏజెన్సీల ద్వారా రాష్ట్రాల్లో  ప్రభుత్వాలను కూల్చి.. పాగా వేయడమే  వాళ్ల పని అని ఆమె ఆరోపించారు.  దేశంలో  నిరుద్యోగం 40 శాతానికి పెరగగా.. బెంగాల్ లో  45 శాతం నిరుద్యోగం తగ్గిందన్నారు. మీడియా ప్రజలను నిందితులుగా చూపే ప్రయత్నం చేస్తుందన్నారు. విష ప్రచారం ద్వారా బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మమతా బెనర్జీ  విమర్శించారు.