10 షోకాజ్ నోటీసులిచ్చినా లెక్క చేయను

10 షోకాజ్ నోటీసులిచ్చినా  లెక్క  చేయను

తనకు ఎలక్షన్ కమిషన్ నోటీసులివ్వడాన్ని తప్పుబట్టారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 10 షోకాజ్ నోటీసులిచ్చినా తాను లెక్క చేయబోనన్నారు. ఐక్యంగా ఓటేయమని చెప్పడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. హిందూ-ముస్లింలు అంటూ మాట్లాడే నరేంద్ర మోడీకి ఎన్ని నోటీసులిచ్చారని చెప్పాలన్నారు మమత. గతంలో గద్దార్ మీర్ జాఫర్ కు టికెట్ ఇచ్చి తప్పు చేశానంటూ పరోక్షంగా రాజీబ్ బెనర్జీపై మండిపడ్డారు మమత. ఏప్రిల్ 3న హూగ్లీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మమతా..కొన్ని పార్టీలు మైనార్టీలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని..ఇలాంటి టైంలో ముస్లీంలంతా ఏకం కావాలన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ..48 గంటల్లో వివరణ ఇవ్వాలని మమతకు నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం.