ఒంటి కాలుతో బెంగాల్ ను..రెండు కాళ్లతో ఢిల్లీని గెలుస్తా

V6 Velugu Posted on Apr 06, 2021

కోల్‌‌‌‌కతా: ‘‘పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటికాలితో గెలుస్తా. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో రెండు కాళ్లతో గెలుస్తా..” అని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాను రాయల్ బెంగాల్ టైగర్ అని, బెంగాల్​లో గుజరాత్ వ్యక్తుల పాలన రాబోదన్నారు. చత్తీస్​గఢ్​లో ఎన్ కౌంటర్ ఘటనపై స్పందిస్తూ.. కేంద్రం పరిపాలనపై కాకుండా బెంగాల్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టిందని విమర్శించారు. సోమవారం చుంచురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. మోడీ తనను రోజూ ‘‘దీదీ... ఓ దీదీ..” అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని, అయినా ఆ కామెంట్లను లెక్కచేయనన్నారు.  

Tagged assembly elections 2021, Delhi, bengal, mamatha

Latest Videos

Subscribe Now

More News