పకోడా అమ్మిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ

పకోడా అమ్మిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు పక్కనున్న టీ షాపులోకి వెళ్లి పకోడా అమ్మారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెల్పహారి నుండి ఝర్‌గ్రామ్‌కు తిరిగి వెళ్తున్న దీదీ.. అంధారియా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన తన కాన్వయ్ ను ఆపి ఓ టీ స్టాల్ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ ఆమె ఓనర్ గా మారి స్ధానికులకు పకోడా అమ్మారు. సీఎం మమత సడన్ ఎంట్రీతో అక్కడ జనం గుమిగూడారు. మమతాబెనర్జీ చిరుతిళ్లను అమ్మడం  ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో డార్జిలింగ్‌లోని ఒక చిన్న స్టాల్‌లో మమత మోమోలను తయారు చేస్తూ కనిపించారు. 

బకాయిలు ఇవ్వకపోతే GST  ఆపేస్తాం 

తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలను చెల్లించకపోతే అధికారం నుంచి వైదొలగాలన్నారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ చెల్లింపులను నిలిపి వేస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం విడుదల చేయడం లేదన్నారు.  తమ బకాయిలను చెల్లించండి అని కేంద్రాన్ని అడుక్కోవాలా..? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.