నీట్, జేఈఈ వాయిదా వేయాలి: మమతా బెనర్జీ

నీట్, జేఈఈ వాయిదా వేయాలి: మమతా బెనర్జీ

కేంద్రాన్ని కోరిన మమతా బెనర్జీ

కరోనావైరస్ కంట్రోల్ లోకి వచ్చేవరకు నీట్, జేఈఈ పరీక్షలను వాయిదావేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులందరికీ సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యమని ఆమె అన్నారు.

‘సెప్టెంబరులో NEET, JEE 2020ను నిర్వహించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. అయితే మరోసారి కరోనా తీవ్రతను అంచానా వేయాలి. పరిస్థితి అనుకూలంగా ఉండే వరకు ఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా విద్యార్థులందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం మా కర్తవ్యం’అని టీఎంసీ అధినేత ట్వీట్ చేశారు.

మోడీతో జరిగిన మా చివరి వీడియో కాన్ఫరెన్స్‌లో.. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) మార్గదర్శకాలకు వ్యతిరేకంగా 2020 సెప్టెంబర్ చివరి నాటికి విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో టెర్మినల్ పరీక్షలను పూర్తి చేయాలని ప్రధాని మోడీ ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. అలా చేస్తే విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మోడీకి చెప్పినట్లు ఆమె తెలిపారు.

జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు.

జేఈఈ (మెయిన్) సెప్టెంబర్ 1 నుండి 6 వరకు, నీట్ (యుజి) సెప్టెంబర్ 13న జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ప్రకటించింది.

For More News..

బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉంది

20 వేలమందికి ఉపాధితో పాటు వసతి కల్పించిన సోనూసూద్

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు